ఎల్​ఐసీ లాభం రూ. 13,763 కోట్లు

ఎల్​ఐసీ లాభం రూ. 13,763 కోట్లు

న్యూఢిల్లీ : బీమా కంపెనీ లైఫ్ ​ఇన్సూరెన్స్​కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎల్ఐసీ) నికరలాభం ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్​లో వార్షికంగా 2 శాతం పెరిగి రూ.13,763 కోట్లకు చేరుకుంది.   అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్​లో సంస్థ రూ.13,428 కోట్ల లాభాన్ని ఆర్జించింది.  రిపోర్టింగ్ క్వార్టర్​లో బీమా సంస్థ మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే రూ.2,00,185 కోట్ల నుంచి రూ.2,50,923 కోట్లకు పెరిగిందని ఎల్‌‌ఐసీ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌లో పేర్కొంది.  

ఎల్‌‌ఐసీ మొదటి ఏడాది ప్రీమియం ఆదాయం  కూడా గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.12,811 కోట్ల నుంచి తాజా  క్వార్టర్​లో రూ.13,810 కోట్లకు మెరుగుపడింది.  రిపోర్టింగ్ పీరియడ్‌‌లో రెన్యువల్​ ప్రీమియంల ద్వారా వచ్చే ఆదాయం ఏడాది క్రితం రూ.76,009 కోట్లతో పోలిస్తే రూ.77,368 కోట్లకు పెరిగింది.  మార్చి 2024తో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఎల్​ఐసీకి రూ. 40,676 కోట్ల లాభం వచ్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ. 36,397 కోట్లు వచ్చాయి.