ఎల్​ఐసీకి రూ.183 కోట్ల జీఎస్టీ డిమాండ్​ నోటీసు

ఎల్​ఐసీకి రూ.183 కోట్ల జీఎస్టీ డిమాండ్​ నోటీసు

న్యూఢిల్లీ :  తెలంగాణలోని సర్వీస్‌లకు సంబంధించి రూ.183 కోట్ల విలువైన వడ్డీ,  పెనాల్టీతో పాటు జీఎస్టీ వసూలు కోసం కమ్యూనికేషన్/డిమాండ్ ఆర్డర్‌‌‌‌ను అందుకున్నట్లు  ఎల్‌‌‌‌ఐసీ సోమవారం ప్రకటించింది. “తెలంగాణ రాష్ట్రానికి వడ్డీ,  పెనాల్టీతో పాటు జీఎస్టీ వసూలు కోసం కార్పొరేషన్ కమ్యూనికేషన్/డిమాండ్ ఆర్డర్‌‌‌‌ను తీసుకున్నాం. ఈ ఆదేశాలను హైదరాబాద్ రూరల్ డివిజన్ అప్పిలేట్ జాయింట్ కమిషనర్ (ఎస్టీ) ఎదుట అప్పీల్ చేయవచ్చు” అని రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌లో పేర్కొంది.

2017–-18 ఆర్థిక సంవత్సరానికి డిమాండ్ ఆర్డర్ కమ్ పెనాల్టీ నోటీసు ప్రకారం, రూ. 93 కోట్ల జరిమానా, రూ. 81 కోట్ల వడ్డీతో పాటు రూ. ఎనిమిది కోట్ల జీఎస్టీని చెల్లించాలని ఎల్‌‌‌‌ఐసీని ప్రభుత్వం కోరింది. నోటీసు ప్రకారం, రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద అదనపు ఇన్‌‌‌‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌‌‌‌ను,  రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద స్వల్ప చెల్లింపును (షార్ట్​పేమెంట్​)  క్లెయిమ్ చేసినట్లు తెలిపింది. ఈ ఏడాది నవంబర్‌‌‌‌లో, ఎల్‌‌‌‌ఐసీకి ఏప్రిల్–-సెప్టెంబర్‌‌‌‌లో మొత్తం ప్రీమియం ఆదాయంలో సంవత్సరానికి దాదాపు 11 శాతం పడిపోయి రూ. 2.1 లక్షల కోట్లకు చేరుకుంది.