V6 News

అదానీ పోర్ట్స్‌‌లో వాటా తగ్గించుకున్న LIC

అదానీ పోర్ట్స్‌‌లో వాటా తగ్గించుకున్న LIC

న్యూఢిల్లీ: భారతదేశపు అతిపెద్ద ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఎల్‌‌ఐసీ, గత నెలలో అదానీ పోర్ట్స్‌‌లో తన వాటాను తగ్గించుకుంది. నవంబర్ 11–డిసెంబర్ 10 మధ్య 3.89 కోట్ల షేర్లు (2.007శాతం) విక్రయించింది. 

వీటి విలువ దాదాపు రూ.6 వేల కోట్లు. ఈ డీల్‌తో అదానీ పోర్ట్స్‌‌లో ఎల్‌‌ఐసీ వాటా 9.35శాతం నుంచి 7.34శాతానికి తగ్గింది.  ప్రస్తుతం ఎల్‌‌ఐసీ వద్ద 15.86 కోట్ల షేర్లు ఉన్నాయి. తాజా సేల్‌‌ ఓపెన్ మార్కెట్‌‌లో జరిగింది. 

మరోవైపు కరెంట్ ట్రాన్స్‌‌మిషన్ లైన్స్ బిజినెస్‌‌లో ఉన్న అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌‌ శుక్రవారం పీఎఫ్‌‌సీ కన్సల్టింగ్ నుంచి  కేపీఎస్‌‌–3 హెచ్‌‌వీడీసీ ట్రాన్స్‌‌మిషన్‌ను  కొనుగోలు చేసింది.