ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ఎల్ఐసీ బిగ్ రిలీఫ్.. పాలసీ క్లెయిమ్ సెటిల్మెంట్‌పై కీలక నిర్ణయం

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ఎల్ఐసీ బిగ్ రిలీఫ్.. పాలసీ క్లెయిమ్ సెటిల్మెంట్‌పై కీలక నిర్ణయం

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో బాధితుల క్లెయిమ్ సెటిల్‌మెంట్ల కోసం స్టేట్ రన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) జూన్ 3న పలు ఉపశమనాలను ప్రకటించింది. రైలు ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు క్లెయిమ్ సెటిల్‌మెంట్లను వేగవంతం చేస్తామని జాతీయ బీమా సంస్థ తెలిపింది. LIC పాలసీలు, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన క్లెయిందారుల కష్టాలను తగ్గించడానికి, LIC క్లెయిమ్ సెటిల్‌మెంట్ల కోసం వివిధ రాయితీలను ప్రకటించింది.

"రిజిస్టర్డ్ డెత్ సర్టిఫికేట్‌లకు బదులుగా, రైల్వే అధికారులు, పోలీసులు లేదా ఏదైనా రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రచురించిన మరణాల జాబితా మరణానికి రుజువుగా అంగీకరించబడుతుంద" ని జీవిత బీమా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. క్లెయిమ్ కు సంబంధిత సందేహాలకు ప్రతిస్పందించడానికి, హక్కుదారులకు సహాయం అందించడానికి ఎల్‌ఐసి డివిజనల్, బ్రాంచ్ స్థాయిలలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను కూడా ఏర్పాటు చేసింది.

తాజా నివేదికల ప్రకారం, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ అనే రెండు ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైలు ఒకదానికొకటి ఢీకొనడంతో దాదాపు 288 మంది మరణించారు. 800 మందికి పైగా గాయపడ్డారు . దేశంలోనే అత్యంత దారుణమైన రైల్వే విషాదాల్లో ఇదొకటి కావడం గమనార్హం.