9 కేఎఫ్‌‌సీ, డామినోస్‌‌ ఔట్‌‌ లెట్ల లైసెన్సులు సస్పెన్షన్

9 కేఎఫ్‌‌సీ, డామినోస్‌‌ ఔట్‌‌ లెట్ల లైసెన్సులు సస్పెన్షన్

హైదరాబాద్, వెలుగు: టీజీ సేఫ్ 13 టీములు హైదరాబాద్​లోని ప్రముఖ ఫాస్ట్‌‌ఫుడ్‌‌ సంస్థలు కేఎఫ్‌‌సీ, డామినోస్ పిజ్జాకు చెందిన 26 బ్రాంచీల్లో తనిఖీలు నిర్వహించాయి. నిబంధనలు ఉల్లంఘించిన తొమ్మిది ఔట్‌‌లెట్ల ఎఫ్‌‌ఎస్‌‌ఎస్‌‌ఏఐ లైసెన్సులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. 

స్టోర్ రూమ్‌‌లు, కిచెన్లలో బొద్దింకలు, ఈగలు, ఎలుకల పెంట కనిపించాయి. గడువు ముగిసిన ఆహార పదార్థాల నిల్వ, కోల్డ్ రూమ్‌‌ల్లో నీటి లీకేజీలు, గోడలకు ఫంగస్, సిబ్బంది ఆప్రాన్లు, హెయిర్ నెట్లు ధరించకపోవడం వంటి లోపాలను గుర్తించారు. వాడిన నూనెను శుద్ధి చేసి మళ్లీ వాడేందుకు అనుమతి లేని కెమికల్ వాడుతున్నట్లు గుర్తించారు. ఈ 9 బ్రాంచ్​లను ఆన్‌‌లైన్ డెలివరీ ప్లాట్‌‌ఫారాల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశించారు.