ఆర్మీలో చేరిన ధోని

ఆర్మీలో చేరిన ధోని

వరల్డ్ కప్ తర్వాత రెండు నెలల పాటు క్రికెట్‌కు విరామం ఇచ్చాడు సీనియర్ క్రికెటర్ ధోని. ఈ విరామ సమయంలో ఓ 15 రోజులపాటు భారత సైన్యంలో పనిచేసేందుకు సిద్ధమయ్యాడు . లెఫ్టినెంట్ హోదాలో పారాచూట్ రెజిమెంట్‌లో ట్రైనింగ్ తీసుకోని ఆర్మీలో సేవ చేయనున్నాడు. గురువారం 106 టెర్రిటోరియల్ ఆర్మీ బెటాలియన్‌లో చేరిన ధోని ఈ నెల 31 నుంచి ఆగష్టు 15 వరకు బెటాలియన్‌తో శిక్షణ తీసుకోనున్నాడు. ఈ ట్రైనింగ్‌లో పెట్రోలింగ్, పోస్ట్ డ్యూటీ, గార్డ్ పనులను చేయనున్నాడు. దేశ రక్షణకు అహర్నిశలు శ్రమించే సైన్యం విధుల్లో తానూ భాగం కావాలని ధోని ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ఇండియన ఆర్మీ చేత 2011 లో లెఫ్టినెంట్ కల్నల్ హోదా పొందిన ధోని.. 2015లో ప్యారా ట్రూపర్‌గానూ క్వాలిఫై అయ్యాడు. ప్రస్తుతం ధోనీ ప్రాతినిధ్యం వహిస్తున్న బెటాలియన్ బెంగళూరు హెడ్ క్వార్టర్స్ కేంద్రంగా పనిచేస్తుంది.