కరోనాతో జీవితకాలం రెండేండ్లు తగ్గింది

కరోనాతో జీవితకాలం రెండేండ్లు తగ్గింది

ముంబైకి చెందిన ఐఐపీఎస్ సంస్థ స్టడీలో వెల్లడి 
ముంబై:  కరోనా మహమ్మారి బారినపడి దేశంలో ఇప్పటికే నాలుగున్నర లక్షల మంది బలైపోయిన్రు. మరెంతో మంది రకరకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నరు. కోట్లాది మంది ఉపాధి కోల్పోయి ఇంకా ఇబ్బందులు పడ్తున్నరు. అయితే కరోనా వల్ల ఇలాంటి సమస్యలు రావడం మాత్రమే కాదు.. మన జీవితకాలం కూడా తగ్గిపోయిందట. కరోనా వ్యాప్తి వల్ల ఏర్పడిన ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. ఇండియన్ల జీవితకాలం యావరేజ్ గా రెండేండ్లు తగ్గిపోయిందని ముంబైకి చెందిన ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపీఎస్) వెల్లడించింది. ‘పుట్టిన కాలాన్ని బట్టి ఆయుష్షు అంచనా’ వేసేందుకు చేపట్టిన ఈ స్టడీ వివరాలు గురువారం ‘బీఎంసీ పబ్లిక్ హెల్త్’ జర్నల్​లో పబ్లిష్​అయ్యాయి. ప్రస్తుత కాలంలో ఉన్న పరిస్థితులు మున్ముందు కూడా కొనసాగితే.. ఇప్పుడు పుట్టిన వాళ్లు యావరేజ్ గా ఎన్నేండ్లు జీవించవచ్చు? అన్న అంశంపై ఈ స్టడీ జరిగింది. దీంతో కరోనా మహమ్మారి ఇండియన్ల జీవితకాలంపైనా నెగెటివ్ ఎఫెక్ట్​ను చూపించిందని, ఇప్పుడు పుట్టినోళ్ల ఆయుష్షును సగటున రెండేండ్లు తగ్గించిందని వెల్లడైంది. 
35- 69 మధ్య వాళ్లలోనే ఎక్కువ డెత్స్ 
‘‘దేశంలో 2019లో పుట్టిన మగపిల్లల ఆయుస్సు యావరేజ్ గా 69.5 ఏండ్లు ఉండగా, 2020లో పుట్టిన మగపిల్లల ఆయుష్షు వైరస్ కారణంగా 67.5 ఏండ్లకు తగ్గిపోయింది. 2019లో పుట్టిన ఆడపిల్లల జీవితకాలం 72 ఏండ్లు ఉండగా, 2020లో పుట్టిన ఆడపిల్లల లైఫ్ ఎక్స్ పెక్టెన్సీ 69.8 ఏండ్లకు పడిపోయింది” అని ఐఐపీఎస్ తన రిపోర్టులో పేర్కొంది. అలాగే సాధారణ సంవత్సరాలతో పోలిస్తే.. 2020లో వైరస్ కారణంగా 35 నుంచి 69 ఏండ్ల మధ్య ఉన్నవాళ్లే అత్యధికంగా చనిపోయారని స్టడీలో తేలింది. దీంతో ఈ ఏజ్ గ్రూపు, ఇతర ఏజ్ గ్రూపుల మధ్య మరణాల్లో అసమానత్వం భారీగా పెరిగిపోయినట్లు తెలిపింది.  

కాలుష్యంతో 5.9 ఏండ్లు తగ్గింది
ఎయిర్ పొల్యూషన్ కారణంగా దేశంలోని ప్రజల ఆయుష్ష 5.9 ఏండ్లు తగ్గిపోయిందని షికాగో వర్సిటీ స్టడీలోనూ తేలింది. ఢిల్లీ, కోల్​కతాతో పాటు ఉత్తరాదిలో  ఉంటున్న 51 కోట్ల మంది జీవితకా లం యావరేజ్ గా 8.5 ఏండ్లు తగ్గిం దని వెల్లడైంది. ఒక్క ఢిల్లీ సిటీలోనే 9.7 ఏండ్లు లైఫ్ స్పాన్ తగ్గిపోయిన ట్లు వర్సిటీ పేర్కొంది. ఉత్తరాదిలో ఎయిర్ క్వాలిటీ లైఫ్​ ఇండెక్స్ ఆధా రంగా ఈ స్టడీ చేసినట్లు తెలిపింది.