భార్యను చంపిన భర్తకు జీవితఖైదు

భార్యను చంపిన భర్తకు జీవితఖైదు

గచ్చిబౌలి, వెలుగు: భార్యను చంపిన భర్తకు రంగారెడ్డి జిల్లా సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించింది. సైబరాబాద్ సీసీఎస్​ఏడీసీపీ నర్సింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఫరూక్​నగర్​మండలం అన్నారం అనుబంధ గ్రామమైన గుండియా తండాకు చెందిన జటావత్​రమేశ్(36), లలిత(30) భార్యాభర్తలు. వీరిది వ్యవసాయ కుటుంబం. పెండ్లయిన కొన్నాళ్లు కాపురం సాఫీగా సాగగా, తర్వాత అదనపు కట్నం తేవాలని రమేశ్​భార్యను వేధించసాగాడు. 2020 అక్టోబర్​30న రాత్రి 11 గంటల సమయంలో మరోసారి గొడవపడ్డాడు. ఈ క్రమంలో కత్తితో లలితపై దాడి చేసి విచక్షణ రహితంగా పొడిచాడు. స్థానికులు గమనించి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 2020 నవంబర్​5న లలిత మృతి చెందింది. లలిత తండ్రి పత్లావత్​ పీరి ఫిర్యాదుతో షాద్​నగర్​ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నవంబర్​9న రమేశ్​ను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. షాద్​నగర్​పోలీసులు 90 రోజుల్లో చార్జ్​షీట్​ఫైల్ చేశారు. శుక్రవారం కేసును విచారించిన రంగారెడ్డి జిల్లా సెషన్స్​ కోర్టు 9వ అడిషనల్​జడ్జి నిందితుడు రమేశ్​కు జీవిత ఖైదు, రూ.25వేలు ఫైన్​ విధిస్తూ తీర్పు వెల్లడించారు.