జంట హత్యల కేసులో సెషన్స్ కోర్టు కీలక తీర్పు

జంట హత్యల కేసులో సెషన్స్ కోర్టు కీలక తీర్పు

ఆదిలాబాద్ జిల్లాలో సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఓ హత్య కేసులో కీలక తీర్పు ఇచ్చారు. జిల్లాలో జరిగిన జంట హత్య కేసులో 6గురు నేరస్తులకు జీవితఖైదు విధించారు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి మైత్రేయి. బెల్లంపెల్లి ఏసీపీ పరిధిలోని సుబ్బారావు పల్లి శివారులో జరిగిన జంట హత్య కేసుకు సంబంధించి ఈ తీర్పు చెప్పారు.  నిందితులు శివరాత్రి ప్రసాద్, శివరాత్రి నారాయణ, కస్తూరి రవీందర్, కల్లూరి సుధాకర్, శివరాత్రి కృష్ణ, శివరాత్రి శంకర్ లకు జీవిత ఖైదు విధించారు. 
ఈ కేసుకు సంబంధించి మొత్తం 41 మంది సాక్షులను విచారించారు. నేరస్తులపై అభియోగం రుజువు అయ్యింది. ఒక్కొకరికి 13వేల చొప్పున మొత్తం 6గురికి రూ. 78వేల జరిమానా విధించారు న్యాయమూర్తి. 2015 ఆగస్ట్ 2న స్టోన్ క్వారీ భూమి కాజేయాలని కుట్రతో.. ఓనర్స్ సిరికొండ సాంబయ్య, రాస గణపతి లను బర్షెలతో దారుణంగా హత్య  చేశారు. అడ్డువచ్చిన సిరికొండ రాకేష్, సిరికొండ సత్యనారాయణను కూడా తీవ్రంగా గాయాలపాలు చేశారు. 

ఇవి కూడా చదవండి:

ప్రజాధనం దోచుకునే వారిపై చర్యలు తప్పవు

మా పోరాట స్ఫూర్తి కొనసాగుతుంది..ముస్లిం పాలిటిక్స్కి ఇదొక టర్నింగ్ పాయింట్