మా పోరాట స్ఫూర్తి కొనసాగుతుంది..ముస్లిం పాలిటిక్స్కి ఇదొక టర్నింగ్ పాయింట్

 మా పోరాట స్ఫూర్తి కొనసాగుతుంది..ముస్లిం పాలిటిక్స్కి ఇదొక టర్నింగ్ పాయింట్

హైదరాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఎంఐఎం పార్టీ అధినేత ఒవైసీ స్పందించారు. మా పోరాట స్ఫూర్తి కొనసాగుతుంది..ముస్లిం పాలిటిక్స్కి ఇదొక టర్నింగ్ పాయింట్ అని పేర్కొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ సంకీర్ణం బీజేపీని ఓడించలేదని అప్పుడే చెప్పాను, ఏది ఏమైనా  ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తాను, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. హింసాత్మక ఘటనలు జరిగిన లఖింపూర్ ఖేరీలో కూడా బీజేపీ గెలిచిందన్నారు. 80 - 20 అనే అంశం భారత దేశంలో చాలా ఏళ్లు కొనసాగుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పుడు ఓడిపోయాం మళ్లీ పోటీ చేస్తాం, గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మా పోరాట స్ఫూర్తి కొనసాగుతుంది, ముస్లిం పాలిటిక్స్ కి ఇదొక టర్నింగ్ పాయింట్ అవుతుందని అసదుద్దీన్ ఓవైసీ పునరుద్ఘాటించారు. 

 

 

ఇవి కూడా చదవండి

 

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‎డేట్స్

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్