టాటా ఏఐఏ నుంచి రైజింగ్ ఇండియా ఫండ్‌‌

టాటా ఏఐఏ నుంచి రైజింగ్ ఇండియా ఫండ్‌‌

న్యూఢిల్లీ : జీవిత బీమా సంస్థ ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ (టాటా– ఏఐఏ), టాటా ఏఐఏ రైజింగ్ ఇండియా ఫండ్‌‌ను ప్రారంభించింది. న్యూ ఫండ్ ఆఫరింగ్ (ఎన్​ఎఫ్​ఓ) మార్చి 31, 2024 వరకు తెరిచి ఉంటుంది. యూనిట్లను నెట్​అసెట్​ వాల్యూ (ఎన్​ఏవీ) విధానంలో కేటాయిస్తారు. ఎన్​ఎఫ్​ఓ కాలంలో యూనిట్‌‌ ధర రూ. 10 ఉంటుంది. రైజింగ్ ఇండియా ఫండ్ ఆత్మనిర్భర్ భారత్ పరిధిలోని కీలక రంగాల్లో

 కంపెనీలలో పెట్టుబడి పెడుతుంది. వీటిలో మౌలిక సదుపాయాలు, తయారీ, బ్యాంకింగ్, డిజిటల్, రక్షణ మొదలైనవి ఉన్నాయి.  ఈ ఫండ్ లోని 70శాతం-–100శాతం పెట్టుబడులను ఈక్విటీ,  ఈక్విటీ-సంబంధిత సాధనాలలో పెడతారు.   30శాతం వరకు డెట్  మనీ మార్కెట్ సాధనాలలో ఇన్వెస్ట్​ చేస్తారు.