
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని డీజీపీ అంజనీ కుమార్‌కు టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు కురువ విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. అనంతరం విజయ్ మీడియాతో మాట్లాడారు. ‘రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్లను డబ్బులకు, భూములకు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే టికెట్ల విషయంలో రేవంత్ డబ్బులు తీసుకోకపోతే.. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. రేవంత్రెడ్డి అక్రమ ఆస్తులపై విచారణ జరపాలని ఈడీకి ఫిర్యాదు చేశామని, ఈ నేపథ్యంలో ఆయన అనుచరులు తమను భౌతికంగా వేధిస్తున్నారని కురువ విజయ్ పేర్కొన్నారు.