నాటు కోడి పులుసు..గటుక తినండి: వెంకయ్య నాయుడు

నాటు కోడి పులుసు..గటుక తినండి: వెంకయ్య నాయుడు

క్యాన్సర్ తో చనిపోతున్న వ్యక్తులు ఇండియాలోనే టాప్ టెన్ లో ఉన్నారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. హైటెక్ సిటీలోని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో క్యాన్సర్ అవేర్నెస్ అండ్ క్యాన్సర్ పేషెంట్ పై జరిగిన సదస్సులో వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్యాన్సర్ నుండి కోలుకొని మళ్ళీ జీవితం ప్రారంభించిన పేషెంట్లను, వారి కుటుంబ సభ్యులను కలుసుకోవడం ఆనందంగా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కన్న తల్లి, పుట్టిన  భూమిని, మాతృ భాషను, చదువును చెప్పిన గురువును మర్చిపోయిన వాడు మనిషే కాదని తన అభిప్రాయమన్నారు.

క్యాన్సర్ వస్తే కుటుంబ సభ్యులు మొత్తం సఫర్ అవుతారన్న ఆయన... క్యాన్సర్ ను సకాలంలో గుర్తిస్తే ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పారు. క్యాన్సర్ పేషెంట్లకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం ముఖ్యమని తెలిపారు. దేశంలో క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా అభివృద్ధి చెందిందన్న వెంకయ్య.. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడంలో ప్రైవేట్ రంగం సేవలు మరువలేనివని కొనియాడారు. దేశంలో ఏడాదికి పది లక్షల క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ప్రజలు లైఫ్ స్టైల్ మార్చుకోవాలని, జంక్ ఫుడ్ తినడం మానేయాలని సూచించారు. నాటు కోడి పులుసు, గటుక ఆహారంగా తీసుకోవాలని చెప్పారు. వెస్ట్రన్ లైఫ్ స్టైల్ మన దేశ ప్రజలకు అస్సలు మంచిది కాదని చెప్పారు.