జంట జలాశయాల గేట్ల ఎత్తివేత

జంట జలాశయాల గేట్ల ఎత్తివేత

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు గండిపేట్ రిజర్వాయర్‌కు భారీ స్థాయిలో వరద నీరు వచ్చింది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం వరకు నీరు చేరింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో 2 గేట్లు ఒక అడుగు మేర ఎత్తి.. 234 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేశారు. అటు హిమాయత్ సాగర్ జలాశయానికి సైతం వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. 

ALSO READ | పార్కులపై హైడ్రా ఫోకస్.. అధికారులకు రంగనాథ్ కీలక ఆదేశాలు

జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి దగ్గరలో ఉంది. దీంతో బుధవారం సాయంత్రం 7.30 గంటలకు రిజర్వాయర్ 1 గేటు ఒక అడుగు మేర అధికారులు ఎత్తి 348 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో అధికారులు దిగువ ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు.