
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకడిగా పేరు తెచ్చుకుని.. ప్రేక్షకులు రౌడీ హీరోగా అభిమానంతో పిలుచుకునే అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ ఏం చేసినా.. ట్రెండింగ్ లో నిలుస్తూనే ఉంటాడు. అదే తరహాలో ఈ సారి స్లిప్పర్స్ వేసుకొని ఓ వేదికపై అందరికీ షాకిచ్చాడు. మామూలుగా ఫ్యాషన్ ఎంపిక విషయంలో విజయ్.. ఎనర్జిటిక్ రణ్ వీర్ సింగ్ ని అనుసరిస్తాడు. చాలాసార్లు ఆయన్ని ఇమిటేట్ చేసి ఆ విషయాన్ని నిరూపించుకున్నాడు కూడా. అలాంటిది ఇప్పుడు విజయ్.. రణ్ వీర్ తో కలిసి వేదికను పంచుకున్నాడు. ఇటీవల రౌడీ బాయ్ విజయ్ హీరోగా తెరకెక్కిన లైగర్ మూవీకి సంబంధించిన ఈవెంట్ ముంబైలో జరిగింది. అందులో భాగంగా రణ్ వీర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. ఈ వేదికపై వారిద్దరూ చొక్కాలు ఎక్స్ ఛేంజ్ చేసుకుని.. డ్యాన్సులేస్తూ ప్రేక్షకులను అలరించారు. దీని కంటే ముందు ఈ పోగ్రాంకి విజయ్ దేవరకొండ చప్పల్స్ ధరించడం రావడం అంతటాహాట్ టాపిక్ గా మారింది.
ఈ విషయంపై రణ్ వీర్ కూడా తన స్టైల్లో సమాధానమిచ్చాడు. 'భాయ్ కా స్టైల్ దేఖో.. ఐసే లాగ్ రహా హై.. యే మేరే ట్రైలర్ లాంచ్ పే అయ్యా హై యా మెయిన్ ఇంకే ట్రైలర్ లాంచ్ పే అయ్యా హు'' అంటూ హిందీలో వ్యాఖ్యానించాడు. ‘‘బ్రదర్ స్టైల్ చూస్తుంటే నా ట్రైలర్ లాంచ్‌కి విజయ్ వచ్చాడో.. లేదా నేను ఆయన ట్రైలర్ లాంచ్‌కి వచ్చానా అన్న సందేహం వస్తోందని చమత్కరించాడు. బ్లాక్ టీషర్ట్ ధరించి లేత గోధుమరంగు కార్గో ప్యాంట్ తో.. చప్పల్స్ తో కనిపించిన విజయ్ ని రణ్ వీర్.. జాన్ అబ్రహంతో పోల్చాడు. జాన్ కూడా ఈవెంట్ లలో చప్పల్స్ తో కనిపిస్తాడని గుర్తు చేశాడు.