
రోజురోజుకీ పెరుగుతున్న కరోనా వల్ల ఓవైపు స్టార్స్ సినిమాల రిలీజులన్నీ వాయిదా పడుతుంటే.. మరోవైపు మూవీ షూటింగ్స్‌కి కూడా బ్రేక్ పడుతోంది. ముఖ్యంగా ముంబై లాంటి సిటీస్‌లో కొవిడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో షూటింగ్స్ ఆపేస్తున్నారు. ‘లైగర్’ సినిమాపై కూడా ఈ ఎఫెక్ట్ పడింది. ఆ విషయాన్ని విజయ్ దేవరకొండ స్వయంగా కన్‌ఫర్మ్ చేశాడు. ‘మరో వేవ్ మొదలైంది. షూటింగ్ క్యాన్సిలయ్యింది. ఇంట్లోనే చిల్ అవుతున్నా’ అంటూ ట్వీట్ చేశాడు విజయ్.
ఈ మూవీ షూటింగ్ మొదట్నుంచీ ముంబైలోనే జరుగుతోంది. కొవిడ్ కారణంగా ఇప్పటికే చాలాసార్లు షూటింగ్‌కి బ్రేక్ పడింది. తాజాగా మరోసారి పని ఆపక తప్పలేదు. ముంబైలోని స్లమ్‌కి చెందిన ఓ చాయ్‌వాలా ప్రపంచస్థాయి బాక్సర్‌గా ఎలా ఎదిగాడనే కాన్సెప్ట్‌తో పూరి జగన్నాథ్ ఈ మూవీ తీస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌కి సూపర్బ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, మకరంద్ దేశ్‌పాండే ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కరణ్‌జోహార్‌తో కలిసి చార్మి, పూరి నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 25న ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.