
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ‘లైగర్’. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ప్యాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్‌ని వీలైనంత త్వరగా పూర్తి చేసేలో పనిలో ఉంది టీమ్. ముంబై షెడ్యూల్ తర్వాత ఆకాష్ ‘రొమాంటిక్’ కోసం పూరి కొన్ని రోజులు, అలాగే ఆనంద్ ‘పుష్పక విమానం’ ప్రమోషన్స్ కోసం విజయ్ కొన్ని రోజులు ‘లైగర్’కు బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్ కోసం అమెరికాకి ప్రయాణమవుతున్నారు. బ్యాలెన్స్ షూట్‌ను అక్కడే కంప్లీట్ చేయనున్నట్టు రీసెంట్గా విజయ్, పూరి క్లారిటీ ఇచ్చారు. అనన్యాపాండే హీరోయిన్గా చేస్తోంది. రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రోనిత్ రాయ్, విషురెడ్డి, అలీ, మకరంద్ దేశ్‌పాండే, గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నారు. పూరి జగన్నాథ్‌తో కలిసి చార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. ఇది ఒక హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని, విజయ్ నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపిస్తాడని టీమ్ చెబుతోంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించనున్నట్లు తెలిసింది.