బెంగళూరులో ‘లైగర్’ ప్రమోషన్

బెంగళూరులో ‘లైగర్’ ప్రమోషన్

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ రాష్ట్రాలను చుట్టేస్తున్నాడు. లెటెస్ట్ ఫిలిం ‘లైగర్’ కోసం హీరోయిన్, దర్శకులు, చిత్ర యూనిట్ తో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నాడు. అందులో భాగంగా బెంగళూరుకు వచ్చారు. కంఠీరవ స్టేడియానికి వెళ్లి... కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సమాధిని విజయ్ దేవరకొండ, అనన్యా పాండేలు దర్శించుకుని ఘనంగా నివాళులర్పించారు. వీరి వెంట దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఉన్నారు. తొలిసారిగా హీరోగా పరిచయమైన పునీత్ చిత్రానికి పూరి దర్శకత్వం వహించారు. వీరి కాంబినేషన్ లో పలు హిట్ సినిమాలు వచ్చాయి. 

ఇక విజయ్ విషయానికి వస్తే.. కరోనా కారణంగా ఆయన సినిమా థియేటర్లలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ‘లైగర్’ ఈ ఏడాది ఆగస్టు 25న విడుదల కానుంది. తెలుగు, తమిళం, మలయాళంతోపాటు కన్నడ, హిందీల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కరణ్ జోహార్, ఛార్మి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రూపొందింది. ‘అర్జున్ రెడ్డి విడుదలైన రోజే ’లైగర్‘ మూవీ కూడా రిలీజ్ కానుండడంతో కచ్చితంగా సక్సెస్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.