హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు చలిగాలులతో ఉన్న నగరం మంగళవారం ఉదయం నుంచి చిరుజల్లులతో తడిసింది. ఇప్పటికే పెరిగిన చలిగాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు, ఊహించని వర్షంతో ఇంకాస్త ఇబ్బందులకు గురవుతున్నారు. ట్యాంక్‌బండ్, సికింద్రాబాద్, బోరబండ, ఎర్రగడ్డ, సనత్‌నగర్, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్, ఉప్పల్, తార్నాక, కుత్బుల్లాపూర్, చింతల్, ఐడీపీఎల్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. ఉద్యోగులు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్భందులు పడుతున్నారు.