అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ బయట పిడుగు

అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ బయట పిడుగు

అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ బయట పిడుగుపాటుకు ముగ్గురు చనిపోయారు. మరొకరు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వైట్ హౌస్ ఎదురుగా ఉన్న లఫాయెట్ పార్కులో   పిడుగు పడింది. అక్కడే వివావ వార్షికోత్సవ వేడుక జరుపుకుంటున్న దంపతులిద్దరు చనిపోగా మరో యువకుడు చనిపోయాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.  మృతి చెందిన వారిలో దంపతులు  జేమ్స్ ముల్లర్  76,  డోనా ముల్లర్ 75 ఉండగా..  మరో 29 ఏళ్ల యువకుడు ఉన్నారు. 

ప్రమాదం తర్వాత అక్కడకు చేరుకున్న సీక్రెట్ సర్వీస్, యూఎస్ పార్క్ పోలీసులు అత్యవసర సేవల విభాగం సిబ్బందికి సమాచారం అందించి బాధితులను హాస్పిటల్ కు తరలించారు. ముందుజాగ్రత్తగా పార్కులోని కొంత భాగాన్ని అధికారులు గంటసేపు మూసివేశారు.