ట్రాన్స్ ఫార్మర్ పై పడిన పిడుగు... మెదక్ జిల్లాలో ఘటన

ట్రాన్స్ ఫార్మర్ పై పడిన పిడుగు... మెదక్ జిల్లాలో ఘటన
  • రైస్ మిల్లులో షార్ట్ సర్క్యూట్ ..కాలిపోయిన సామగ్రి, వడ్లు    

కౌడిపల్లి, వెలుగు:   ట్రాన్స్ ఫార్మర్ పై పిడుగు పడడంతో కాలిపోయిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండగా.. అదే సమయంలో  కౌడిపల్లి మండలం ధర్మసాగర్ లోని వెంకటేశ్వర బిన్ని రైస్ మిల్ వద్ద  విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పై పిడుగు పడింది. దీంతో షార్ట్ సర్క్యూట్ జరిగి రైస్ మిల్లులో మంటలు ఎగసి పడ్డాయి. మిల్లులోని విలువైన సామగ్రితో పాటు వడ్లు కాలిపోయాయి. మంటలు ఎగసి పొగలు కమ్ముకోవడంతో సమీపంలోని ప్రజలు వెళ్లి మంటలు ఆర్పివేశారు.  ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం  జరగలేదు.