హైస్కూల్‌‌‌‌లో చెట్టుపై పడిన పిడుగు ..స్టూడెంట్లకు తప్పిన ప్రమాదం

హైస్కూల్‌‌‌‌లో  చెట్టుపై పడిన పిడుగు ..స్టూడెంట్లకు తప్పిన ప్రమాదం

ముదిగొండ, వెలుగు : ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని వనంవారి కిష్టాపురం హైస్కూల్‌‌‌‌లో ఉన్న చెట్టుపై సోమవారం పిడుగుపడింది. సోమవారం ఉదయం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలుకాగా.. స్కూల్‌‌‌‌లో ఉన్న గిన్నెపండు చెట్టుపై పిడుగుపడడంతో అది నిలువునా చీలిపోయింది. భారీ శబ్దంతో పిడుగుపడడంతో స్కూల్‌‌‌‌లో ఉన్న స్టూడెంట్లు, టీచర్లు భయంతో కేకలు వేశారు. స్టూడెంట్లు, టీచర్లకు ఏమీ కాకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.