
నిర్మల్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. మామడ మండలం కోరటికల్ గ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఆ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతాయి. నిత్యం వందల మంది భక్తులు స్వామి దర్శనం కోసం వస్తుంటారు. ఈ వేంకటేశ్వరస్వామి ఆలయంపై.. గర్భ గుడి ఉండే శిఖరాగ్రహంపై 2025, సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం పిడుగు పడింది. ఈ ఘటనలో గర్బ గుడి శిఖరాగ్రహం దెబ్బతిన్నది.
నిర్మల్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుంది. ఈ క్రమంలోనే ఈ పిడుగు పడింది. పిడుగు పడిన సమయంలో ఆలయంలో భక్తులు లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. బతుకమ్మ, నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సమయం.. పిల్లలకు సెలవులు.. సహజంగానే ఆలయాల్లో రద్దీ ఉంటుంది. వర్షం కారణంగా భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో.. పిడుగు పడిన సమయంలో భక్తులు సమీపంలో లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పిందంటున్నారు ఆలయ నిర్వహకులు.
పిడుగు స్వామి వారి గర్భ గుడి శిఖరాగ్రహంపై పడటంతో.. పెచ్చులు ఊడి కింద పడ్డాయి. ఆ సమయంలో భక్తులు లేకపోవటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. పిడుగుపాటుకు దెబ్బతిన్న ఆలయం శిఖరాగ్రహంకు మరమ్మత్తులు చేస్తామని స్పష్టం చేశారు ఆలయ నిర్వహకులు