డ్యాన్స్ ఫ్లోర్పై చిచ్చు బుడ్డిలా.. అడవి శేష్ మాస్ స్టెప్స్

డ్యాన్స్ ఫ్లోర్పై చిచ్చు బుడ్డిలా.. అడవి శేష్ మాస్ స్టెప్స్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా  షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతోన్న చిత్రం ‘డెకాయిట్’.  బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.  అన్నపూర్ణ  స్టూడియోస్  సమర్పణలో  సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు.   సునీల్ నారంగ్  సహ నిర్మాతగా  వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 10న సినిమా విడుదల  కానుంది.  ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌‌లో కొనసాగుతున్నాయి.

 పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, అలాగే మొదటి సాంగ్ ‘రుబారు’.. అన్నీ  ప్రేక్షకుల నుంచి  మంచి  స్పందన పొందుతూ సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా సెకండ్ సింగిల్ అప్‌‌డేట్  ఇచ్చారు మేకర్స్.  ‘చిచ్చుబుడ్డి’ అంటూ సాగే పాటను  మార్చి 28న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.  ఇది అదిరిపోయే డాన్సింగ్ నెంబర్ అని, అడివి శేష్ ఫస్ట్ టైమ్ డ్యాన్స్ ఫ్లోర్‌‌‌‌పై మాస్ స్టెప్స్ వేయనున్నాడని మేకర్స్ తెలియజేశారు. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన  ఈ పాటలో  పాప్ సింగర్ జోనిత గాంధీ  ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అన్నారు.