భద్రాచలం, వెలుగు : భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్క్రూట్నీలో రిజెక్ట్ అయిన మహాకూటమి అభ్యర్థి హరిశ్చంద్రనాయక్ నామినేషన్‌ను సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ లైన్ క్లియర్ చేశారు. ఇటీవల నామినేషన్రిజెక్ట్ కావడంతో ఆయన సబ్ కలెక్టర్‌ను ఆశ్రయించారు. అన్ని రికార్డులు పరిశీలించి నామినేషన్‌ను అంగీకరించడంతో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నేతలు సంబురాలు చేసుకున్నారు.
మరోవైపు భద్రాచలం పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ఎన్నికల్లో రెబల్‌గా నామినేషన్ వేసిన మాజీ సర్పంచ్భూక్యా శ్వేత విత్‌డ్రా చేసేందుకు ఒప్పుకున్నారు. కాంగ్రెస్ తరఫున ఇప్పటికే పూనెం కృష్ణ దొర నామినేషన్ దాఖలు చేసినది తెలిసిందే. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ప్రస్తుత ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుల సమక్షంలో ఇరువురు అభ్యర్థులను కూర్చోబెట్టి చర్చించారు. పూనెం కృష్ణ దొర నామినేషన్‌ను పార్టీ ఓకే చేయడంతో శ్వేత విత్‌డ్రా చేసుకోవాలని వారు సూచించారు. దీనితో ఆమె అంగీకరించారు.
