ఇకపై శనివారమే కొత్త విద్యుత్ కనెక్షన్లకు లైన్ క్లియరెన్స్

ఇకపై శనివారమే కొత్త విద్యుత్ కనెక్షన్లకు లైన్ క్లియరెన్స్
  • సదరన్ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ప్రకటన

హైదరాబాద్, వెలుగు: కొత్త విద్యుత్ కనెక్షన్ల కోసం ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ నిలిపివేయడం వల్ల వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సదరన్ డిస్కం చెక్ పెట్టింది. ఇకపై కొత్త కనెక్షన్లకు ప్రతీ శనివారం అర్థ గంట పాటు లైన్ క్లియరెన్స్ ఇస్తామని సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ప్రకటించారు. దీంతో వినియోగదారులకు ఇబ్బందులు తగ్గడమే కాకుండా, కొత్త సర్వీసుల మంజూరులో వేగం పెరుగుతుందని చెప్పారు.

 గురువారం చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో  సీఎండీ ఫరూఖీ టెలికాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న కొత్త సర్వీసులు, టైటిల్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్, సోలార్ నెట్ మీటరింగ్, పీఎం సూర్య ఘర్ దరఖాస్తులపై సమీక్ష చేశారు. ప్రస్తుతం 593 అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు, లేఅవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల (ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎం) దరఖాస్తులు డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ వద్ద ఆలస్యమవుతున్నాయన్నారు. వాటిని  రిలీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.