
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. డీఎస్సీ షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. టెట్, డీఎస్సీ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను శుక్రవారం(మే23)న సుప్రీంకోర్టు కొట్టవేసింది. డీఎస్సీ నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది.
16 వేల 347 టీచర్ ఉద్యోగాలు
ఏపీలో 16 వేల 347 టీచర్ ఉద్యోగాలకు ధరఖాస్తు ప్రక్రియ ముగిసింది. జూన్ 06వ తేదీ నుంచి జూలై 08వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే పరీక్షకు మరింత సమయం ఇవ్వాలని కొంతమంది అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. సీబీటీ విధానంలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
పరీక్షలు పూర్తయిన రెండు రోజుల్లో ప్రాథమిక కీని విడుదల చేయనున్నారు. ప్రిలిమినరీ కీల విడుదల తర్వాత 7 రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం ఫైనల్ కీని ప్రకటిస్తారు. మరో 7 రోజుల తర్వాత మెరిట్ జాబితా రిలీజ్ కానుంది.