కరెంట్షాక్తో లైన్ ఇన్ స్పెక్టర్ మృతి.. లైన్మెన్కు తీవ్ర గాయాలు

కరెంట్షాక్తో లైన్ ఇన్ స్పెక్టర్ మృతి.. లైన్మెన్కు తీవ్ర గాయాలు

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: మీటర్ ​రీడింగ్ ​కొడుతుండగా కరెంట్​షాక్​ కొట్టి  లైన్ ఇన్ స్పెక్టర్ చనిపోగా, లైన్​మెన్​తీవ్రంగా గాయపడ్డాడు. సరూర్‌నగర్ సర్కిల్ అబ్దుల్లాపూర్ మెట్ సబ్ స్టేషన్ లో భరత్ (51)లైన్ ఇన్ స్పెక్టర్గా, రాందాస్ లైన్ మెన్గా పని చేస్తున్నారు. సోమవారం  పీగ్లిపూర్ లోని సర్వే నంబర్ 12 వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మీటర్ రీడింగ్ తీసుకుంటుండగా భరత్, రాందాస్​కు కరెంట్​షాక్​కొట్టింది. భరత్ అక్కడికక్కడే చనిపోగా, రాందాస్ తీవ్రంగా గాయపడ్డాడు.

కాగా, ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లే భరత్ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఏఈ కొట్టాల్సిన బిల్లులను లైన్ మెన్, లైన్ ఇన్స్ పెక్టర్ తో కొట్టించారని అందుకే ప్రమాదం జరిగిందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని అబ్దుల్లాపూర్ మెట్ ఇన్ స్పెక్టర్ అశోక్ రెడ్డి  తెలిపారు. ఘటన గురించి తెలుసుకున్న టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ విచారణకు ఆదేశించారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.