
రాయికోడ్/మునిపల్లి, వెలుగు: లింగంపల్లి బాలుర గురుకుల సొసైటీ డార్మెటరీ బిల్డింగ్ ఏడోతరగతి గది కుప్పకూలిన ఘటనలో ముగ్గురు స్టూడెంట్స్ గాయపడిన విషయం తెలిసిందే. పాత బిల్డింగ్‌ను పూర్తిగా కూల్చివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త భవన నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేసింది. ఈ సందర్భంగా బుధవారం అడిషనల్కలెక్టర్చంద్రశేఖర్గురుకులాన్ని సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడుతూ.. ఎవరూ భయపడొద్దన్నారు. ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలే అయ్యాయని వారు సేఫ్ గా ఉన్నారని చెప్పారు.
స్కూల్ బిల్డింగ్ కు ఎదురుగా ఎల్ఎన్టీ సహకారంతో ఇటీవల నిర్మించిన తరగతి గుదులను పరిశీలించారు. వాటిపై తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేసి, స్టూడెంట్స్ కు వసతి కల్పించాలన్నారు. దసరా హాలిడేస్ లోపు తాత్కాలిక డార్మెటరీ నిర్మాణం పూర్తి చేయాలని, శిథిలావస్థలో ఉన్న మంచినీటి ట్యాంక్‌ను కూడా కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పాత డార్మెటరీ బిల్డింగ్‌ను అధికారులు పూర్తిగా కూల్చివేయించారు. పాఠశాలలో జరిగిన సంఘటనతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు మంగళవారం రాత్రి నుంచే తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్తున్నారు.