
న్యూఢిల్లీ: పాన్ మసాలాతోపాటు సిగరెట్లు వంటి టొబాకో ప్రొడక్టులపై వేస్తున్న జీఎస్టీ సెస్ మాగ్జిమమ్ రేటుపై క్యాప్ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆయా ప్రొడక్టుల రిటెయిల్ రేటుకు ఈ హయ్యస్ట్ రేటును లింక్ చేస్తున్నట్లు తెలిపింది. ఫైనాన్స్ బిల్లుకు చేసిన సవరణలలో దీనిని ప్రతిపాదించారు. పాన్‌మసాలా యూనిట్(ప్యాకెట్ లేదా వేరేదైనా) రిటెయిల్ సేల్ రేటుపై గరిష్టంగా 51 శాతం దాకా జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్‌ను ఈ సవరణ కింద విధించే వీలు కలుగుతుంది. ప్రస్తుతం యాడ్ వాలోరమ్ కింద 135 శాతం సెస్‌గా విధిస్తున్నారు. ఇక సిగరెట్లపై ప్రతి వెయ్యి స్టిక్స్‌కు రూ. 4,170 చొప్పున, అదనంగా యాడ్ వాలోరమ్ కింద రిటెయిల్ రేటుపై 290 శాతం హయ్యస్ట్ రేటుగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
ఈ ప్రొడక్టులపై 28 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. ఈ జీఎస్టీకి అదనంగా సెస్‌నూ విధిస్తారు. జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ యాక్ట్‌లో సంబంధిత సవరణలను తెచ్చారు. జీఎస్టీ కాంపెన్సేషన్ ఎంత అనేది కచ్చితంగా తెలియాలంటే, జీఎస్టీ కౌన్సిల్ నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందేనని ట్యాక్స్ ఎక్స్పర్టులు చెబుతున్నారు. తాజా సవరణతో నోటిఫికేషన్ ద్వారా రేట్లను మార్చే వీలు జీఎస్టీ కౌన్సిల్‌కి కలుగుతుంది. పాన్‌మసాలా, టొబాకో ప్రొడక్టులపై ట్యాక్సేషన్పద్ధతిలో ఇది చెప్పుకోదగ్గ మార్పేనని ఎనలిస్టులు పేర్కొన్నారు.