చైనా పోలీసుల అదుపులో ఫుట్​బాల్​ దిగ్గజం మెస్సీ.. ఏం జరిగిందంటే?

చైనా పోలీసుల అదుపులో ఫుట్​బాల్​ దిగ్గజం మెస్సీ.. ఏం జరిగిందంటే?

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీని చైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెస్సీ వీసా లేకుండానే ప్రయాణం చేయడమే అందుకు ప్రధాన కారణం అని తెలుస్తోంది. గురువారం చైనాలోని బీజింగ్​లోని వర్కర్స్​ స్టేడియంలో ఆస్ట్రేలియా- అర్జెంటీనా మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇదొక ఇంటర్నేషనల్​ ఫ్రెండ్లీ మ్యాచ్​. అందులో భాగంగానే అర్జెంటీనా జట్టుతో కలిసి మెస్సీ చైనాకు వెళ్లాడు. అయితే అతని వద్ద చైనా వీసా లేకపోవడంతో పోలీసులు అడ్డుకున్నారు.

మెస్సీని చైనా ఎయిర్ పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో అతని వద్ద అర్జెంటీనా, స్పానిష్​ రెండు పాస్​పోర్టులు​ ఉన్నాయి. స్పానిష్​ పాస్​పోర్ట్​తో తైవాన్​లో వీసా ఫ్రీ ఎంట్రీ లభిస్తుంది. కానీ చైనాలో ఉచిత ప్రవేశం లేదు. తైవాన్​.. చైనాలో భాగమని భావించిన మెస్సీ అది వెంట బెట్టకెళ్లాడు. మెస్సీతో  చైనా పోలీసులు మాట్లాడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. 

చివరకు సమస్య పరిష్కారమైనట్లు, 20 నిమిషాల ఉత్కంఠ తర్వాత మెస్సీని ఎయిర్​పోర్ట్​ అధికారులు బయటకు పంపినట్లు చైనా మీడియా పేర్కొంది. మెస్సీకి ఎక్స్​పిడైటెడ్​​ వీసా (వేగంగా పొందే వీసా)ను మంజూరు చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

https://fb.watch/l6VVbsreOz/