లిక్కర్, గుట్కా, గంజాయి తెస్తే కఠిన చర్యలు : రాజారావు

లిక్కర్, గుట్కా, గంజాయి తెస్తే కఠిన చర్యలు : రాజారావు

లిక్కర్, గుట్కా, గంజాయి తెస్తే కఠిన చర్యలు

గాంధీ హాస్పిటల్ ​సూపరింటెండెంట్ రాజారావు

సెక్యూరిటీ చెకింగ్​లో దొరికిన మత్తు పదార్థాల కాల్చివేత

పద్మారావునగర్, వెలుగు : గాంధీ హాస్పిటల్ సెక్యూరిటీ చెకింగ్​లో దొరికిన లిక్కర్, కల్లు బాటిళ్లను మంగళవారం హాస్పిటల్ ​డంపింగ్ ​యార్డు వద్ద కుప్పగా పోసి ధ్వంసం చేశారు. గుట్కా, సిగరెట్లు, జర్దా, బీడీలను కాల్చివేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్  రాజారావు మాట్లాడుతూ.. హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న పేషెంట్ కోసం డైలీ 4 నుంచి 10 మంది వస్తున్నారని, అనుమతించకపోతే సెక్యూరిటీ గార్డులపై దాడులకు దిగుతున్నారని చెప్పారు.

ఇలా అటెండెంట్లు వందల్లో వస్తుండడం పెద్ద సమస్యగా మారిందని, ఇటీవల అటెండెంట్ల వద్దనే గంజాయి, లిక్కర్​దొరికాయని చెప్పారు. హాస్పిటల్​కు వచ్చే పేషెంట్లు, అటెండెంట్లు ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకురావద్దని సూచించారు. నిషేధిత పదార్థాలతో చెకింగ్​లో దొరికితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే గంజాయి, కత్తితో దొరికిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపామని ఇన్​స్పెక్టర్ నరేశ్ తెలిపారు. ఆర్ఎంవోలు డా.జయకృష్ణ, డాక్టర్లు రాము, వెంకటరమణ, జీడీఎక్స్ సెక్యూరిటీ చీఫ్ శివాజీ, సిబ్బంది పాల్గొన్నారు.