లిక్కర్ వ్యాన్ బోల్తా : మందు బాటిళ్లు ఎత్తుకెళ్లిన జనం

లిక్కర్ వ్యాన్ బోల్తా : మందు బాటిళ్లు ఎత్తుకెళ్లిన జనం

లిక్కర్ లోడ్‌తో వెళ్తుంది ఆ మినీ వ్యాన్. బీర్, బ్రాంది, విస్కీ, వైన్ ఇలా అన్ని సీసాలు అందులో ఉన్నాయి. అయితే ప్రమాదవశాత్తూ ఆ వాహనం ప్రమాదానికి గురైంది. దీంతో సరకు అంతా రోడ్డుపై పడింది. దీంతో స్థానికులు గుమికూడారు. అసలు ఆ వ్యాన్‌లో ఎవరైనా ఉన్నారా..? వారికి ఏమైనా దెబ్బలు తగిలాయా..? ఇలా ఏం చూడలేదు. అందినకాడికి మందు సీసాలు ఎత్తుకెళ్ళిపోయారు. కొందరు అయితే బస్తాలతో వచ్చేశారు. 

మద్యం  సీసాలతో వెళ్తున్న  వాహనం టైరు పేలడంతో  అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న లిక్కర్ బాటిల్స్  నేల పాలయ్యాయి. సమాచారం కొన్ని నిమిషాల్లోనే ఆ ఏరియా స్ప్రెడ్ కావడంతో  మద్యం ప్రియులు హుటాహుటీన అక్కడికి చేరుకుని అందిన కాడికి మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు. రోడ్డుపై కొన్ని   పగిలిపోగా, మిగిలిన వాటికోసం చాలామంది పోటీపడ్డారు. 

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రంగంపేట దగ్గర  ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అందులో ఉన్న మద్యం బాటిళ్ల  కేసులు   నేల పాలయ్యాయి.  అటువైపు వెళ్తున్న జనం కూడ  ఆ బాటిల్స్  కోసం పెద్ద ఎత్తున ఎగబడ్డారు. వాటిని తీసుకెళ్లవద్దని  పట్టుకెళ్లొద్దని డ్రైవర్ ఎంత బ్రతిమిలాడిన జనాలు పట్టించుకోలేదు.  అతని మాట వినకుండా అందిన కాడికి పట్టుకొని ఉడాయించారు.  సుమారు ఆరు లక్షల విలువైన మద్యం సీసాలను జనాలు ఎత్తుకెళ్లారని వాహనం డ్రైవర్ ఆరోపిస్తున్నాడు. అబ్బా ఛాన్స్ దొరికిందిలే అనుకుంటూ బాటిళ్లను దొరికినవాళ్లకు దొరికినట్లు ఎత్తుకెళ్లారు. ఇంకే వేరేది ఏమైనా ఆగేవారు ఏమో కానీ.. అక్కడుంది నోరూరించే లిక్కర్. ఇక మందుబాబులను ఆపడం ఎవరితరం అవుతుంది చెప్పండి.