
- ఎలా వచ్చాయో తెలియదన్న ఎమ్మెల్యే తివారీ
బుక్సర్ : బీహార్ లోని బుక్సర్ సదర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కారులో మందు బాటిల్స్ ను పోలీసులు గుర్తించారు. సిమ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేస్తుండగా ఎమ్మెల్యే కారులో మద్యం బాటిళ్లను తరలిస్తుండగా పట్టుకున్నారు. మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్ లో మందు బాటిల్ దొరకటం కలకలం రేపింది. కారులో ఉన్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఈ కారు ఎమ్మెల్యే సంజయ్ తివారీ పేరుతో రిజిస్టర్ అయి ఉందని బుక్సర్ జిల్లా ఎస్పీ ఉపేంద్రనాథ్ చెప్పారు. ఈ సంఘటనపై ఎమ్మెల్యే తివారీ స్పందించారు. తన కారులోకి మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయో తెలియదని ఎవరో తనపై కుట్ర చేశారంటూ ఆరోపించారు. కొన్ని రోజులుగా ఈ కారులో పేద ప్రజలకు రేషన్ ఉచితంగా అందిస్తూ సేవ చేస్తున్నామన్నారు.