వైన్స్ బంద్ తో భారీగా బ్లాక్ దందా

వైన్స్ బంద్ తో భారీగా బ్లాక్ దందా

అక్ర‌మంగా మ‌ద్యం అమ్ముతున్న ఇళ్ల‌పై ఆక‌స్మిక దాడులు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.
ఖమ్మం జిల్లా.. కూసుమంచి మండలం, పాలేరు గ్రామంలో ఓ వ్యక్తి త‌న‌ ఇంట్లో అక్రమంగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నాడు. దీంతో స‌మాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.. అత‌డి ఇంట్లో సాదాలు చేయ‌గా భారీ ఎత్తున మ‌ద్యం సీసాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేశాడ‌ని అత‌డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అలాగే అడిషనల్ డీసీపీ మురళీదర్ పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో కూసుమంచి మండలం పాలేరులో విసృతంగా పర్యాటించి తనిఖీలు చేపట్టారు. మ‌రోచోట ఇంకో వ్య‌క్తిని గుర్తించిన పోలీసులు..నిబంధనలు అతిక్రమించి పాలేరులో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలిపారు. వారి నుంచి రూ,,66,000/- విలువ గల మద్యం సీసాలను సీజ్ చేశారు. వీరు స్ధానికంగా ఉన్న వైన్స్ షాపు నుంచి మద్యం తీసుకొచ్చి నిల్వ వుంచి ఎక్కువ ధ‌ర‌కు అమ్ముతున్న‌ట్లు విచారణలో తెలిసింది. తదుపరి చట్టపరమైన చర్యల కోసం కూసుమంచి పోలీస్ స్టేషన్ కు అప్పగించిన‌ట్లు తెలిపారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. రాష్ట్రంలో లాక్ డౌన్ క్ర‌మంలో మ‌ద్యం దొర‌క్క ఇలా అక్ర‌మంగా అమ్మ‌కాలు చేస్తున్న‌ట్లు తెలిపారు. రూల్స్ బ్రేక్ చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు పోలీసులు.