పంజాబ్‌లో మందు హోమ్‌ డెలివరీ

పంజాబ్‌లో మందు హోమ్‌ డెలివరీ
  • రేపటి నుంచి తెరుచుకోనున్న షాపులు
  • ఉదయం 9 నుంచి 1 వరకు ఓపెన్‌

చండీగఢ్‌: పంజాబ్‌లో గురువారం నుంచి లిక్కర్‌‌ షాపులు ఓపెన్‌ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే షాపులు ఓపెన్‌ ఉంటాయని అధికారులు చెప్పారు. షాపుల దగ్గర జనాన్ని తగ్గించేందుకు మందు డోర్‌‌ డెలివరీ చేస్తున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్‌లో కేవలం రెండు లీటర్లు వరకు మాత్రమే ఇస్తున్నట్లు చెప్పారు. పంజాబ్‌ మేడ్‌ లిక్కర్‌‌ (పీఎమ్‌ఎల్‌)ను డోర్‌‌డెలివరీ చేసేందుకు పర్మిషన్‌ లేదని అన్నారు. డెలివరీ బాయ్స్‌ కర్ఫ్యూ పాస్‌ కలిగి ఉండాలని, దాని కోసం ముందే అధికారుల దగ్గర బండి రిజిస్టర్‌‌ చేయించుకోవాలని చెప్పారు. షాపుల దగ్గర ప్రతి ఒక్కరు సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించాలని, ఎంప్లాయిస్‌ కూడా కొంత మంది మాత్రమే ఉండాలని చెప్పారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు లిక్కర్‌‌ షాపులు ఓపెన్‌ చేయాలని, దానికి పర్మిషన్‌ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన మొదటి రాష్ట్రం పంజాబ్‌.