రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరలు

రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరలు

హైదరాబాద్: రాష్ట్రంలో  లిక్కర్ ధరలు పెరిగాయి. మద్యం ధరలను భారీగా పెంచుతూ రాష్ట్ర సర్కార్ బుధవారం నిర్ణయం తీసుకుంది.  ఒక్కో బీరుపై రూ. 20, మద్యం క్వార్టర్‌ పై రూ.20, ఆఫ్ బాటిల్ పై రూ.40, ఫుల్ బాటిల్ పై రూ.80  పెంచుతున్నట్లు ప్రకటించింది ఎక్సైజ్ శాఖ. పెరిగిన ధరలు గురువారం నుంచి అమలులోకి రానున్నాయి. లాక్ డౌన్ సమయంలో లిక్కర్ పై భారీగా ధరలు పెంచిన సర్కార్ .. ఆ తర్వాత బీర్లపై కాస్త తగ్గించిన విషయం తెలిసిందే. ఓ వైపు ఇప్పటికే నిత్యవసర ధరలు పెరుగుతుండగా.. ఇప్పుడు మద్యం ధరలు పెంచి షాకిచ్చింది సర్కార్.  

మరిన్ని వార్తల కోసం..

దశలవారీగా దళితబంధు అమలు చేస్తాం

వివాదంగా మారిన గుడిసెల తొలగింపు