దశలవారీగా దళితబంధు అమలు చేస్తాం

దశలవారీగా దళితబంధు అమలు చేస్తాం

హైదరాబాద్ : దశలవారీగా దళితబంధు పథకం అమలు చేస్తామన్నారు సీఎం కేసీఆర్. ఈ ఏడాది నియోజకవర్గానికి 1500 మంది చొప్పున లబ్దిదారులను ఎంపిక చేసే ప్రక్రియను కొనసాగించాలని అధికారులకు సూచించారు. ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత దశల వారీగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలన్నారు. దళితబంధు పథకం అమలు ప్రక్రియ వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలోని అన్నిజిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం సూచించారు.

రాష్ట్రం సాధించిన ప్రగతిని తెలియజేస్తూ ప్రసంగాలు ఉండాలన్నారు. ఈ ప్రసంగాలను జిల్లా కలెక్టర్లు నిర్దిష్టమైన సమగ్ర సమాచారంతో తయారుచేయాలన్నారు. వేసవి ఎండల నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఉదయం 9 గం.లకు ప్రారంభించి, త్వరగా ముగించాలన్నారు. సాయంత్రం పూట జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్ రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు సీఎం. తెలంగాణ కేంద్రంగా కవితలను తీసుకురావాల్సిందిగా కవులను, రచయితలను ఆహ్వానించాలని అన్నారు. ఎప్పటిలాగే హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించాలన్నారు సీఎం. అకాల వర్షాల కారణంగా అక్కడక్కడ వరిధాన్యం తడుస్తున్న క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంత ఖ‌ర్చ‌యినా వెనుకాడ‌కుండా.. తడిసిన ధాన్యంతో పాటు చివరి గింజ వరకు ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్తుంద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం
కరీంనగర్​లో నీళ్ల గోస నిజమే

లండన్ లో కేటీఆర్ కు ఘన స్వాగతం