లిక్కర్ కిక్.. లాక్ డౌన్ ఎత్తేశాక ‌రూ.11,243 కోట్ల ఆమ్దాని

లిక్కర్ కిక్.. లాక్ డౌన్ ఎత్తేశాక ‌రూ.11,243 కోట్ల ఆమ్దాని
  • ఐదు నెలల్లోనే రాష్ట్రానికి మస్తు ఆదాయం
  • ఇదే టైంల గతేడాది రాబడి రూ.8,384 కోట్లే
  • లిక్కర్‌‌ రేట్లు పెంచడమే కారణమంటున్న ఎక్సైజ్ వర్గాలు

హైదరాబాద్‌‌, వెలుగురాష్ట్రంలో లాక్‌‌డౌన్‌‌ తర్వాత  ఆబ్కారీ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఫుల్‌‌ ఇన్ కమ్ వస్తోంది. సేల్స్ సాధారణంగా ఉన్నా ఆమ్దానీ మాత్రం బాగా పెరిగింది. రేట్లు పెంచడంతో  ఐదు నెలల్లో నే రూ.11,243 కోట్ల ఆదాయం వచ్చింది.ఇదే టైంకి లాస్ట్‌‌ ఇయర్‌‌ రూ.8,384 కోట్లే వచ్చాయి. ఈ ఏడాది ఐదు నెలల్లోనే 2,859 కోట్లు అదనంగా వచ్చాయి. మరో వైపు బీర్ల అమ్మకాలు కాస్త పెరిగాయి.

మస్తు ఇన్ కమ్

లాక్‌‌డౌన్‌‌ కారణంగా మార్చి 22 నుంచి మే 5 వరకు వైన్స్‌‌ బంద్‌‌ చేశారు. మే 6 నుంచి తిరిగి వైన్స్‌‌ స్టార్ట్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2211 వైన్స్‌‌లు ఉన్నాయి. లాక్‌డౌన్‌తో వైన్స్ బంజేడయంతో  రాష్ట్ర ఖజానాకు సుమారు రూ.4వేల కోట్ల వరకు నష్టం వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. కరోనా కారణంగా కోల్పోయిన ఆదాయాన్ని తిరిగి పొందేందుకు ప్రభుత్వం లిక్కర్‌‌పై రేట్లను 20% వరకు పెంచింది. అంతకు ముందు డిసెంబర్‌‌లో కూడా 20% వరకు లిక్కర్‌‌ రేట్లు పెంచింది. పోయిన ఏడాదితో పోలిస్తే ఈ ఐదు నెలల్లో సేల్స్‌‌ తగ్గినా ఆదాయం మాత్రం మస్తు పెరిగింది. మేలో రూ.2,270 కోట్లు, జూన్‌‌లో రూ.2,391 కోట్లు, జులైలో రూ.2,506 కోట్లు, ఆగస్టులో రూ.2,397 కోట్ల లిక్కర్ సేల్ అయ్యింది. ఈ ఐదు నెలల్లో కోటి38 లక్షల 26 వేల 826 కేసుల లిక్కర్‌‌, కోటి 11 లక్షల 6వేల 922 కేసుల బీర్లు సేల్ అయ్యాయి.

సెప్టెంబర్‌‌లో 49 శాతం అదనంగా ఆమ్దాని..

ఇక సెప్టెంబర్‌‌లో 25 వరకు రూ.1,678 కోట్ల మద్యం సేల్ అయ్యింది. ఇందులో 21 లక్షల కేసుల లిక్కర్‌‌, 16.69 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. ఇదే టైంలో గతేడాది రూ.1130 కోట్ల సేల్స్‌‌ మాత్రమే జరిగాయి. గతేడాది సెప్టెంబర్‌‌తో పోలిస్తే ఈసారి రూ.548.67 కోట్లతో 49.5% అదనంగా ఆదాయం వచ్చింది. ఈ నెలలోనే బీర్ల సేల్స్‌‌ కాస్త పెరిగాయి. కరోనా భయానికి తోడు, బీర్ల రేట్లు పెరగడంతో సేల్స్ తగ్గాయి. ఆగస్టులో బీర్ల గ్రోత్‌‌ రేట్‌‌ మైనస్‌‌ 43% ఉండగా, సెప్టెంబర్‌‌లో మైనస్‌‌ 32 శాతానికి తగ్గింది. ఎక్కువ మంది లిక్కర్‌‌ తాగడానికే ఇంట్రస్ట్‌‌ చూపిస్తున్నారు. ఏపీ సరిహద్దు జిల్లాలైన నల్గొండ జిల్లాలో అధికంగా రూ.151 కోట్లు, ఖమ్మంలో రూ.127 కోట్ల చొప్పున లిక్కర్‌‌ సేల్ అయ్యింది. ఏపీలో లిక్కర్‌‌ రేట్లు ఎక్కువగా ఉండటంతోపాటు లిమిటెడ్‌‌గా అమ్ముతున్నారు. దీంతో అక్కడి వినియోగదారులు ఈ రెండు జిల్లాల్లో ఎక్కువగా కొంటున్నారు.

రాష్ట్రంలో లిక్కర్‌‌ ఆదాయం డబుల్‌‌..

రాష్ట్రంలో లిక్కర్‌‌ ఆదాయం డబుల్‌‌ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్‌‌ రేట్లను పలు దఫాలు పెంచడమే కారణం. 2014–15 సంవత్సరంలో సర్కారుకు రూ.10,883 కోట్ల ఆదాయం వస్తే..లాక్‌‌డౌన్‌‌ తర్వాత 5 నెలల్లో రూ.11,243 కోట్ల ఇన్‌‌కమ్‌‌ వచ్చింది. లిక్కర్‌‌ రేట్లు పెరగడం, గుడుంబా వినియోగం తగ్గడమే మద్యం రాబడి పెరగడానికి కారణాలని ఎక్సైజ్‌‌ వర్గాలు చెబుతున్నాయి.