థర్టీ ఫస్ట్ దావత్.. లిక్కర్ సేల్స్ అదుర్స్..

థర్టీ ఫస్ట్ దావత్.. లిక్కర్ సేల్స్ అదుర్స్..

థర్టీ ఫస్ట్ దావత్ అంటే మందు బాబులే కాదు.. మామూలు జనాలు సైతం వైన్స్ ముందు బారులు కడతారు. దీంతో  కేకులు, చికెన్, మటన్ లతో పోటీగా లిక్కర్ సేల్స్ జోరందుకుంటున్నాయి. అయితే ఈ ఏడాది బీర్లు, బ్రాండెడ్ వైన్ బాటిళ్ల సేల్స్ బాగా పెరిగాయని వైన్ షాప్ ఓనర్లు చెబుతున్నారు. అర్థరాత్రి వరకు లిక్కర్ సేల్స్ కు అవకాశం ఉన్నా.. మనోళ్లు ముందే మందు పార్టీ కోసం అరేంజ్ మెంట్ చేసుకుంటున్నారు. చుక్క తాగి ముక్క తిని చిందేసేందుకు రెడీ అవుతున్నారు. 

రోజువారీ సేల్స్ తో పోలిస్తే డిసెంబర్ 31 రోజు లిక్కర్ సేల్స్ 2 రెట్లు ఎక్కువ ఉంటాయని వ్యాపారులు అంటున్నారు. అయితే శనివారం కావడంతో అమ్మకాలపై దాని ప్రభావం ఉండొచ్చని ఆందోళన చెందుతున్నారు. థర్డీ ఫస్ట్ సేల్స్ లో మెజార్టీ భాగం యువతదేనని అంటున్నారు. అన్ని రకాల బ్రాండ్స్ కు డిమాండ్ ఉన్నా బీర్ సేల్స్ మాత్రం ఎక్కువ ఉంటాయని చెబుతున్నారు. లిక్కర్ విషయంలో రూ.2,500 వరకు రేటున్న మద్యం కొనుగోలుకు ఎక్కువ మంది మొగ్గుచూపుతారని వైన్స్ నిర్వాహకులు చెబుతున్నారు. కస్టమర్ల కోరే ప్రతి బ్రాండ్ అందుబాటులో పెట్టామని అంటున్నారు. 

31 రోజు జరిగే అమ్మకాల్లో బీర్ సేల్స్ 40శాతంగా ఉంటే లిక్కర్ వాటా 60శాతం ఉంటుందని వైన్ షాప్ ఓనర్లు చెబుతున్నారు. యూత్ ఎక్కువగా బీర్లు కొంటారని, లిక్కర్ సేల్స్ ఎక్కువ కావాలని కోరుకుంటామని అంటున్నారు. గతేడాది లాగే ఈసారి కూడా అమ్మకాలు ఉండాలని భావిస్తున్నట్లు చెప్పారు.