మద్యం దుకాణం పైకప్పు రేకులు కట్ చేసి చోరీ

మద్యం దుకాణం పైకప్పు రేకులు కట్ చేసి చోరీ
  • సీసీ కెమెరాలో రికార్డయిన వైన్ షాపు చోరీ

ఖమ్మం జిల్లా:  మధిరలో ఓ వైన్స్ షాప్ లో దొంగతనం జరిగింది. రాత్రి ఓ దొంగ వైన్ షాప్ పైకి ఎక్కి రేకులు కట్ చేసి... ఆ పై షాపులో దూరి.. సరుకంతా చోరీ చేసాడు. లక్ష రూపాయల విలువ చేసే మద్యం, 65 వేల నగదు ఎత్తుకెళ్లాడు. బైక్ పార్క్ చేసి దొంగతనం చేసిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. చోరీకి ముందు రెక్కి చేసినట్లు అనుమానంతో పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించారు. 
వైన్ షాపు పక్కనే బైకు పార్క్ చేసి.. దర్జాగా చోరీ 
మధిర పట్టణంలో విజయవాడ రోడ్డులో ఉన్న ఓ వైన్ షాప్ లో చోరీ చేసిన దొంగ.. పక్కా రెక్కీ చేసి మరీ చోరీ చేసినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. అర్ధరాత్రి సమయంలో బైక్ మీద వచ్చిన ఆగంతకుడు బైక్ ను వైన్ షాప్ పక్కన పార్క్ చేశాడు. ఆ తర్వాత వైన్ షాప్ పైకి ఎక్కి రేకులు కట్ చేసి లోనికి ప్రవేశించాడు. షాపులో నిల్వ ఉన్న సుమారు ఒక లక్ష రూపాయల విలువైన ప్రీమియం మద్యంతోపాటు క్యాష్ కౌంటర్లో ఉన్న 65 వేలు నగదును  కూడా తీసుకుని చక్కగా బస్తాలలో ప్యాక్ చేసుకొని మరీ వెళ్లిపోయాడు. చోరీ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.