
- గౌడ, ఎస్సీ, ఎస్టీలకు డ్రా తీసిన కలెక్టర్లు
- నేటి నుంచి ఆప్లికేషన్ల స్వీకరణ షురూ
- 2023లో 15,256 ఆప్లికేషన్స్, రూ.305 కోట్ల ఇన్‌కం
- ఈ సారి 20 వేల అప్లికేషన్స్ టార్గెట్
నల్గొండ/యాదాద్రి వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో 329 వైన్స్ షాపుల రిజర్వేషన్లకు టెండర్లు పిలిచారు. గౌడ, ఎస్సీ, ఎస్టీలకు డ్రా ద్వారా కలెక్టర్లు షాపులు కేటాయించారు. శుక్రవారం నుంచి వచ్చే నెల 18 వరకు అన్ని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో ఆప్లికేషన్స్ స్వీకరిస్తారు. ప్రస్తుతం 336 షాపులు ఉండగా ఏడు షాపులు తగ్గించారు. సూర్యాపేట జిల్లాలో 99 షాపులకు గాను 93, నల్లగొండ జిల్లాలో 155 షాపులకు గాను ఒకషాపు తగ్గించి, వేరే జిల్లాలకు షిప్ట్ చేశారు.
2023 ఆగస్టులో నిర్వహించిన టెండర్లలో 336 షాపులకు15,256 ఆప్లికేషన్స్ వచ్చాయి. ఒక్కో ఆప్లికేషన్ రుసుం రెండు లక్షలు కాగా, ప్రభుత్వాని కి రూ.305.12 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకుముందు 2 021లో ఇవే షాపులకు 8,481 దరఖాస్తులు వచ్చాయి. కాగా వచ్చే రెండేళ్లకుగాను నిర్వహిస్తున్న ఈ టెండర్లకు కనీసం 20 వేల అప్లికేషన్స్రాబట్టాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టింది.
అప్లికేషన్ రుసుం రూ.3లక్షలు
కేవలం అప్లికేషన్స్రూపంలోనే సుమారు రూ.600కోట్ల ఆదాయం రాబట్టాలనేది టార్గెట్ పెట్టుకోగా దీని కోసం మిల్లర్లు, రియల్ఎస్టేట్వ్యాపారులను ఎక్సైజ్టెండర్లలో పాల్గొనేందుకు ప్రోత్సహించాలని, బిజినెస్ వల్ల వచ్చే ప్రయోజనాల గురించి వివరించి ప్రభుత్వం ఆదాయం పెంచాలని ప్రభుత్వం ఇప్పటికే మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. గౌడ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన షాపులు పోను మిగిలిన షాపులు జనరల్ కోటాకు కేటాయించారు.
యాదాద్రి జిల్లాలో 82 షాపులు
2023-– 25 ఎక్సైజ్ పాలసీలో యాదాద్రి జిల్లాలో 82 షాపులకు 3969 అప్లికేషన్లు అమ్ముడు పోయాయి. రూ. 79.38 కోట్ల ఇన్‌కం వచ్చింది. 2021-–23లో షాపుల సంఖ్య పెరిగినా.. 1379 అప్లికేషన్లు తక్కువగా రావడంతో రూ. 27.58 కోట్లు మాత్రమే వచ్చింది. జిల్లాలోని 82 షాపుల్లో 53 షాపులను జనరల్ కేటగిరికి కేటాయించారు. ఎస్సీలకు 7, ఎస్టీలకు 1 షాపు రిజర్వేషన్ కావడంతో ఆయా వర్గాలకు చెందిన వారితో ఇతర వర్గాలకు చెందిన వారు సిండికేట్ కావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. గౌడ సామాజిక వర్గానికి 21 షాపులు కేటాయించారు.
అప్లికేషన్ల ఇన్‌కంపై ఎక్సైజ్ ఆశ
త్వరలో జడ్పీ, పంచాయతీ, మున్సిపాలిటీ, ఆ తర్వాత కో ఆపరేటివ్ ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో కొత్తగా లిక్కర్షాపులకు నోటిఫికేషన్రిలీజ్కావడంతో ఎక్సైజ్‌శాఖ భారీ ఆశలు పెట్టుకుంది. గత ఎక్సైజీ పాలసీ సమయంలో అసెంబ్లీ, పార్లమెంట్ఎలక్షన్లు జరగడంతో పెద్ద ఎత్తున అప్లికేషన్లు కొనుగోలు చేశారు. భారీగా ఇన్‌కం సమకూరింది.
సామాజిక వర్గాల వారీగా షాపుల కేటాయింపు
జిల్లాపేరు గౌడ ఎస్సీ ఎస్టీ
నల్లగొండ 34 14 04
సూర్యాపేట 27 10 3
యాదాద్రి 21 7 1