
హైదరాబాద్ సిటీ, వెలుగు: డిఫెన్స్క్యాంటీన్నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పట్టుకున్నట్లు శంషాబాద్ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ తెలిపారు. డిఫెన్స్ పార్టీ క్యాంటీన్ నుంచి శేరిలింగంపల్లి హఫీజ్‌పేట్ మీదుగా ఆదివారం ఒక కారులో మద్యం బాటిళ్లను తరలిస్తున్నారని వచ్చిన సమాచారంతో టీడీఎఫ్సీఐ ప్రవీణ్ కుమార్ తన టీమ్‌తో వెళ్లి పట్టుకున్నారు. కారులో 115 మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 86.25 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని, విచారణ చేస్తున్నామని చెప్పారు.