Shubman Gill : గిల్ కంటే ముందు డబుల్ సెంచరీ చేసింది వీళ్లే

Shubman Gill :  గిల్ కంటే ముందు డబుల్ సెంచరీ చేసింది వీళ్లే

ఉప్పల్ స్టేడియంలో  కివీస్ తో జరుగుతోన్న తొలి వన్డే మ్యాచ్లో ఓపెనర్ బ్యాట్స్మెన్  శుభ్‌మన్‌ గిల్(208) రెచ్చిపోయి ఆడాడు. ఓపెనర్ గా క్రీజ్ లోకి వచ్చిన గిల్..  చివరి ఓవర్  వరకు క్రీజ్లో ఉండి డబుల్ సెంచరీ బాదాడు. గిల్ డబుల్ సెంచరీలో  మొత్తం19 ఫోర్లు, 9 సిక్స్‌లున్నాయి. గిల్ కు ఇదే ఫస్ట్ డబుల్ సెంచరీ కాగా ఇండియా తరుపున వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా అతను రికార్డు సృష్టించాడు. 

ఇండియా తరుపున ముందుగా మాస్టర్ బ్లాస్టర్  సచిన్ టెండుల్కర్(200) డబుల్ సెంచరీ బాదాడు. సౌతాఫ్రికా మీద 2010లో సచిన్  డబుల్ సెంచరీ కొట్టాడు. ఆ తరువాత ఈ రేర్ ఫిట్ ను  వీరేంద్ర సెహ్వాగ్ 2011లో అందుకున్నాడు. వెస్ట్ఇండిస్ పై  సెహ్వాగ్(219)  డబుల్ సెంచరీ బాదాడు. ఇక 2013, 2017లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఫిట్ను రెండుసార్లు అందుకున్నాడు. 2013లో ఆస్ట్రేలియాపై 209 పరుగులు, 2014లో శ్రీలంకపై 264  పరుగులు చేశాడు.  

ఇక  ఈ లిస్టులో నాలుగో ప్లేస్ లో యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషాన్ నిలిచాడు. గతేడాది బంగ్లాదేశ్ పై 210 పరుగులు చేసి అతిచిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన రికార్డును ఇషాన్ నెలకొల్పాడు. అయితే ఆ రికార్డును కివీస్ మ్యాచ్ తో గిల్ అధిగమించాడు.  23 ఏళ్ల గిల్ డబుల్ సెంచరీ సాధించి టీమిండియా తరుపున ఐదో ఆటగాడిగా ఈ లిస్టులో చోటు సంపాదించుకున్నాడు.