వనపర్తి జిల్లాలో తొలి విడత పంచాయతీ ఓటర్లు 1,21,528 మంది కాగా.. 1,03,225 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. 84.91 శాతం పోలింగ్ నమోదైంది. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి–శారద దంపతులు తన సొంతూరు పెద్దమందడి మండలంలోని మంగంపల్లిలో ఓటు వేశారు.
కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లో వెబ్ కాస్టింగ్‌ను కలెక్టర్ ఆదర్శ్‌సురభి పరిశీలించారు. పలు సెంటర్లను ఎస్పీ సునీతారెడ్డి సందర్శించి పోలింగ్‌సరళిని తెలుసుకున్నారు. మొదటి విడత 5 మండలాల్లో పురుషులు 60,253, మహిళలు 61,275 మంది ఓటు వేశారు. ఖిల్లాగణపురం మండలంలో 87.7, పెద్ద మందడిలో 85.7, ఏదులలో 83.9, రేవల్లిలో 83.0, గోపాల్పేట మండలంలో 82.3 శాతం పోలింగ్‌నమోదైంది.
వనపర్తి జిల్లా కొత్త సర్పంచ్ల జాబితా:

