IPL 2024: రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ ఆటగాళ్లు వీళ్ళే.. ఆ దేశాల నుంచే ఏడుగురు

IPL 2024:  రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ ఆటగాళ్లు వీళ్ళే.. ఆ దేశాల నుంచే ఏడుగురు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 వేలం కోసం తుది ఆటగాళ్ల జాబితాను డిసెంబర్ 11న, సోమవారం నాడు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) విడుదల చేసింది. డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగబోయే వేలానికి మొత్తం 333 మంది క్రికెటర్లు ఎంపికయ్యారు. వీరిలో 214 మంది భారతీయ ఆటగాళ్లు, 119 మంది విదేశీ ఆటగాళ్లు, ఇద్దరు అసోసియేట్ దేశాల ఆటగాళ్లున్నారు. 23 మంది 2కోట్ల బేస్ ప్రైజ్ లిస్టులో ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.
 
సాధారణంగా ఐపీఎల్ వేలం అంటే అందరి చూపు 2 కోట్ల బేస్ ప్రైజ్ ఆటగాళ్ల మీదే ఉంటుంది. ఈ సారి ఈ లిస్టులో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లు అత్యధిక సంఖ్యలో ఎంపికయ్యారు. 23 ఆటగాళ్లలో 7 గురు ఆస్ట్రేలియా, 7 గురు ఇంగ్లాండ్, ముగ్గురు దక్షిణాఫ్రికా  ఆటగాళ్లతో పాటు ముగ్గురు భారత ఆటగాళ్లు ఎంపికయ్యారు. న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక్కొక్కరు ఎంపికయ్యారు.
               
వరల్డ్ కప్ హీరోస్ ట్రావిస్ హెడ్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ కు ఎక్కువ ధర పలికే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా బౌలింగ్ ఆల్ రౌండర్ కొయెట్జ్ మీద ఫ్రాంచైజీలు భారీ డబ్బు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రిలీ రోసౌ, డేవిడ్ విల్లీ లాంటి ఆటగాళ్లకు ఎక్కువ ధర పలికిన ఆశ్చర్యం లేదు. భారత ఆటగాళ్లలో హర్షల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్ ఈ లిస్టులో ఉన్నారు.  

IPL 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడిన హర్షల్ 14 వికెట్లు తీశాడు. అయితే ఈ ఫాస్ట్ బౌలర్ ఎకానమీ రేటు 9.66 ఉండడంతో ఆర్సీబీ వదిలేసుకుంది. బౌలింగ్ ఆల్‌రౌండర్ ఠాకూర్ KKR తరపున ఆశించిన స్థాయిలో రాణించలేదు. 10.48 ఎకానమీ తో 11  మ్యాచ్ ల్లో ఏడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇక బ్యాటింగ్‌ లో 14.13 సగటుతో 113 పరుగులు చేశాడు. IPL 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరపున ఎనిమిది మ్యాచ్‌లలో ఉమేష్ ఒక వికెట్ మాత్రమే సాధించాడు. 


ఆస్ట్రేలియా:
ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, పాట్ కమిన్స్, జోష్ ఇంగ్లిస్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, సీన్ అబాట్

ఇంగ్లాండ్
హ్యారీ బ్రూక్, క్రిస్ వోక్స్, జేమ్స్ విన్స్, జామీ ఓవర్టన్, డేవిడ్ విల్లీ, బెన్ డకెట్, ఆదిల్ రషీద్ 

భారత్: 
హర్షల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్

దక్షిణాఫ్రికా: 

రిలీ రోసౌ, గెరాల్డ్ కోయెట్జీ,  వాన్ డెర్ డస్సెన్

న్యూజీలాండ్( లాకీ ఫెర్గూసన్), ఆఫ్ఘనిస్థాన్(ముజిబూర్ రెహమాన్), బంగ్లాదేశ్ (ముస్తాఫిజుర్ రెహమాన్)