స్టూడెంట్ల సూసైడ్లను ఎట్ల అడ్డుకుంటరో చెప్పండి..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

స్టూడెంట్ల సూసైడ్లను ఎట్ల అడ్డుకుంటరో చెప్పండి..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఎగ్జామ్ రిజల్ట్స్ టైంలో టెన్త్, ఇంటర్ స్టూడెంట్లు సూసైడ్ చేసుకోకుండా తీసుకుంటున్న చర్యలేమిటో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. స్టూడెంట్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొంటూ లాయర్ ఎం.శంకర్ పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్ అలోక్ అరాధే బెంచ్ విచారించింది. విచారణ సందర్భంగా ఇంటర్ బోర్డు తరఫున కమిషనర్ నవీన్ మిట్టల్ కౌంటరు దాఖలు చేశారు. అందులో స్టూడెంట్ల ఆత్మహత్యలను అరికట్టేందుకు చేపట్టిన చర్యలను వివరించారు. 2023 మార్చిలో ప్రైవేటు, ప్రభుత్వ ఇంటర్​ కాలేజీల ప్రిన్సిపాళ్లు, అధికారులతో సమావేశం నిర్వహించామని తెలిపారు. ఒత్తిడిని తగ్గించేందుకు స్టూడెంట్లు 8 గంటలు నిద్ర పోయేలా చూడాలని కాలేజీల మేనేజ్మెంట్లను కోరామన్నారు. కోర్టు స్పందిస్తూ.. ఆత్మహత్యల వల్ల రిజల్ట్స్​ ప్రకటించకుండా ఏదైనా మార్గం ఉంటే చెప్పాలని పిటిషనర్ ను కోరింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.