వైరల్: భారత సైనికులకు బుడతడి స్పెషల్ సెల్యూట్

వైరల్: భారత సైనికులకు బుడతడి స్పెషల్ సెల్యూట్

లేహ్: సోషల్ మీడియాలో ప్రతి రోజూ చాలా వీడియోలు ట్రెండింగ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఎమోషనల్ వీడియోలు మాత్రం అందర్నీ కట్టిపడేస్తాయి. అలాంటి ఓ వీడియోనే లేహ్‌‌కు చెందిన ఈ బుడతడిది. ఇండియన్ సోల్జర్స్‌‌కు సెల్యూట్ చేస్తున్న ఈ బుడతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాలు.. లేహ్‌‌లోని ఓ గ్రామానికి చెందిన ఒక బుడతడు భారత సైనిక అధికారులను చూడగానే సెల్యూట్ చేశాడు. అధికారులకు అతడు సెల్యూట్ చేయడం అందర్నీ ఆకట్టుకుంటోంది. సదరు బాలుడు సెల్యూట్ చేస్తున్న విధానం తప్పుగా ఉండటంతో సోల్జర్లు బుడతడి దగ్గరకు వచ్చి ఎలా చేయాలో నేర్పించడం విశేషం. దీంతో ఆ పిల్లాడు మళ్లీ సెల్యూట్ చేశాడు. యాటిట్యూడ్ అనేది లోపల నుంచి వస్తుందని, ఆ ఎనర్జీ సూపర్బ్, జై ఛోటూ జవాన్, స్పెషల్ సెల్యూట్ సూపర్బ్ అంటూ ఈ వీడియోకు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఛోటూ జవాన్ సెల్యూట్ వీడియోను మీరూ చూసేయండి.