చాలా పెద్ద కోరికే.. ఐపీఎల్ కప్ కొట్టే వరకు స్కూల్కు వెళ్లను.. స్టేడియంలో చిన్నారి బ్యానర్

చాలా పెద్ద కోరికే.. ఐపీఎల్ కప్ కొట్టే వరకు స్కూల్కు వెళ్లను.. స్టేడియంలో చిన్నారి బ్యానర్

ఐపీఎల్ లో ఏ ఫ్రాంచైజ్ కు లేనంత ఫ్యాన్ బేస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఉంది. ఈ 16 సంవత్సరాల ఐపీఎల్ ప్రయాణంలో ఒక్క కప్పు గెలవకపోయినా.. ఫ్యాన్స్ ఎప్పుడూ నిరాశ పడలేదు. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ సీజన్ లో చూసుకుందాం.. అంటూ ఆర్సీబీ వెన్ను తడుతూ వచ్చారు.

తమ ఫేవరెట్ స్టార్ ఆటగాళ్లు జట్టుకు దూరం అయినా.. చేతుల్లోని ఆర్సీబీ జెండా మార్చలేదు. ఎన్ని ట్రోల్స్ వచ్చిన ధైర్యంగా ఎదురుకున్నారు. జట్టుకు అడ్డంగా నిలబడి ట్రోల్స్ కు సమాధానం ఇచ్చారు. టీం కప్పు గెలవాలని పూజలు చేశారు. కంకణాలు కట్టుకున్నారు. అయితే, తాజాగా కొందరు ఫ్యాన్స్.. ఆర్సీబీ కప్పుకొట్టాలని రకరకాలుగా దీక్షలు తీసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. తాజాగా ఓ బుడ్డోడు (ఆర్సీబీ ఫ్యాన్) వైరల్ అవుతున్నాడు.

రీసెంట్ గా ‘విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే.. ఆర్సీబీ కప్పు కొడితే పెళ్లి చేసుకుంటా’ అంటూ స్టేడియంలో ప్లకార్డుల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ఓ చిన్నారి స్టేడియంలో ‘ఆర్సీబీ కప్పు కొట్టేవరకు నేను స్కూల్ కు వెళ్లను’ అంటూ ప్లకార్డు పట్టుకొని.. జట్టును సపోర్ట్ చేశాడు. ఆ చిన్నారి ఫొటో తీసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఈ ఫొటోలు నెటిజన్లు ఢిఫరెంట్ గా స్పందిస్తున్నారు.. 

చిట్టి తల్లికి పెద్ద కోరిక కలిగిందే అని కొందరు అంటే.. ఇలాంటి ప్రతిజ్ణపై కట్టుబడి ఉంటే మాత్రం.. పెళ్లి వరకు చిన్నారి స్కూల్ కు వెళ్లాల్సిన అవసరం లేదంటూ సెటైర్లు వేస్తున్నారు. అందరికీ సమ్మర్ హాలిడేస్ రెండు నెలలు ఉంటే.. ఈ చిన్నారి మాత్రం ఈసారి వచ్చే ఐపీఎల్ వరకు సమ్మర్ హాలిడేస్ అంటూ ఈసారి కూడా కప్ గెలిచేది కష్టమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. 

ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చిన్నారి వాళ్ల మమ్మీ డాడీ పర్మీషన్ తీసుకుంటూ అంటూ మరికొంత మంది మరింత సంప్రదాయబద్దంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే ఐపీఎల్ సీజన్స్ మొత్తం ముగుస్తాయి కానీ.. ఆర్సీబీ కప్ కొట్టదు.. ఈ చిన్నారికి చదువు అబ్బదు అంటూ డైరెక్ట్ ఎటాక్ చేస్తున్నారు.