రూ.10 ఇచ్చి బర్గర్ ఆర్డర్ చేసిన చిన్నారి... ఆ తర్వాత ఏమైందంటే...

రూ.10 ఇచ్చి బర్గర్ ఆర్డర్ చేసిన చిన్నారి... ఆ తర్వాత ఏమైందంటే...

ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకోవాలి, పేదవారికి సాయం చేయాలి, ఆకలితో అలమటిస్తున్న దీనులకు తిండి పెట్టాలన్న మాటలను చాలా మంది చెప్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం దాన్ని చేతల్లో చూపించాడు. ఆకలితో బర్గర్ కొనడానికి కేవలం రూ.10తో షాప్ కు వచ్చిన ఓ బాలికకి... మిగతా రూ.80 కలిపి బర్గర్ ఇప్పించాడు. అది ఎవరో కాదు. ఆ షాప్ లో పనిచేసే ఓ ఉద్యోగే. అక్కడే క్యాష్ కౌంటర్లో కూర్చున్న ఆ ఉద్యోగి.. ఆ చిన్నారి ఆకలిని అర్థం చేసుకొని, ఆ రూ.10 కి సరిపడా అమౌంట్ కలిపి బర్గర్ ఇప్పించాడు. ఈ ఘటన నోయిడాలోని బొటానికల్‌ మెట్రో స్టేషన్‌కు దగ్గర్లోని బర్గర్‌ కింగ్‌ షాపులో జరిగింది.

ఆకలికి తట్టుకోలేక తన దగ్గరున్న రూ.10నోటు తీసి బర్గర్ కావాలని షాప్ స్టాఫ్ ను అడిగింది. కానీ ఆ చిన్నారి అడిగిన బర్గర్ ధర రూ.90. కానీ అదేమీ ఆ అమ్మాయికి చెప్పకుండా అక్కడే క్యాష్ కౌంటర్లో కూర్చొని ఉన్న ఓ ఉద్యోగి తన జేబులోంచి మిగతా రూ.80 ఇచ్చాడు. ఆ తర్వాత బర్గర్‌ అందుకున్న ఆనందంలో ఆ చిన్నారి నవ్వుతూ బయటకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా కొందరు ఆ ఉద్యోగిని మెచ్చుకుంటున్నారు. మరికొందరేమో ఇది పెయిడ్ ప్రమోషన్ అంటూ విమర్శిస్తున్నారు. అయితే ఈ చిన్నారికి తన సొంత డబ్బులతో బర్గర్‌ కొని పెట్టిన రెస్టారెంట్‌ మేనేజర్‌ ధీరజ్‌ కుమార్‌ను బర్గర్‌ కింగ్‌ సన్మానించింది. నలుగురికీ స్ఫూర్తిగా నిలిచారంటూ కొనియాడింది. సంబంధిత పోస్ట్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది.